భార్యతో శారీరక సంబంధానికి భర్త నిరాకరించడం హిందూ వివాహ చట్టం ప్రకారం క్రూరమే అయినప్పటికీ, నేరం కాదని కర్ణాటక హైకోర్టు తెలిపింది. ఈ క్రమంలో ఓ మహిళ తన భర్త, అత్తమామలపై పెట్టిన క్రిమినల్ కేసును న్యాయస్థానం కొట్టేసింది. 2019లో వీరి వివాహం కాగా, భార్య పిటిషన్ మేరకు 2022లో ఫ్యామిలీ కోర్టు వీరి పెళ్లి రద్దు చేసింది. అయితే, తనపై ఉన్న క్రిమినల్ కేసు కొట్టేయాలని భర్త కోరగా, విచారించిన కోర్టు అందుకు అంగీకరించింది.