ఒడిశా రైలు ప్రమాదంపై సీబీఐ విచారణ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా సోరో సెక్షన్ సిగ్నల్ జూనియర్ ఇంజినీర్ ను ఇటీవలే రహస్య ప్రాంతంలో అధికారులు ప్రశ్నించారు. అయితే, మరోసారి విచారణకు బాలాసోర్ వెళ్లగా, సదరు అధికారి కుటుంబంతో సహా అదృశ్యమయ్యాడు. దీంతో అతడు ఉంటున్న ఇంటిని సీబీఐ అధికారులు సీజ్ చేశారు. కాగా, ఈ రైలు ప్రమాదంలో 292 మంది ప్రాణాలు కోల్పోగా, వెయ్యి మందికి పైగా గాయపడ్డారు.