గిరిజన సంక్షేమశాఖ పరిధిలోని పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని యూటీఎఫ్ నేతలు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం వారి ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు విజయనగరం జిల్లా, పార్వతీపురం ఐటీడీఏ కార్యాలయం వద్ద రాత్రి బస చేశారు. పీజీహెచ్ఎం పోస్టులను పదోన్నతులతో భర్తీ చేయాలని, భాషా వలంటీర్లను నియమించాలని కోరారు. ఈ నిరసనలో యూటీఎఫ్ నాయకులు విజయగౌరి, మురళీమోహన్రావు, రమేష్ తదితరులున్నారు.