నర్సీపట్నం చింతపల్లి ప్రధాన రహదారిపై ఇటీవల గోతులు పడి పలు వాహనదారులకు ప్రమాదాలు జరుగుతుండడంతో సమస్యని మున్సిపల్ వైస్ చైర్మన్ కోనేటి రామకృష్ణ దృష్టికి తీసుకువెళ్లారు. దీనిపై స్పందించిన వైస్ చైర్మన్ కోనేటి రామకృష్ణ సోమవారం ఆర్ అండ్ బి అధికారులతో మాట్లాడి గోతులను దగ్గరుండి మరమ్మత్తులు చేయించి గుంతలను కప్పించారు. రహదారి బాగుపడడంతో పలువురు వాహనదారులు హర్షం వ్యక్తం చేశారు.