ప్రతిపక్ష నేత చంద్రబాబు తీరును వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా ఎండగట్టారు. నాలుగున్నర దశాబ్దాల అనుభవం ఉన్న నాయకుడు ఈసారి సొంత నియోజకవర్గంలో గెలుపు కోసం ఆపసోపాలు పడుతూ అలవికాని హామీలు ఇస్తున్నారు. తాను గెలిస్తే చాలు అనుకుంటున్నారు. ఇక అయన పార్టీ గురించి చెప్పేదేముంది! అంటూ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.