ప్రభుత్వం ప్రాధాన్యతగా నిర్దేశించుకున్న ప్రాజెక్టుల పూర్తి ప్రత్యేక దృష్టిపెట్టాలని సీఎం వైయస్.జగన్ మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రతి 15 రోజులకోసారి పనుల ప్రగతిని సమీక్షించుకోవాలని సూచించారు. ఈమేరకు కార్యాచరణ చేసుకుని వేగంగా వాటిని పూర్తిచేయాలన్నారు. సోమవారం తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ఇరిగేషన్ ప్రాజెక్టులపై సీఎం వైయస్ జగన్ సమీక్ష నిర్వహించారు. వెలగొండ, వంశధార, అవుకు సహా పలు ప్రాధాన్యతా ప్రాజెక్టుల్లో పరిస్థితులను సీఎం సమీక్షించారు. ఈ ప్రాజెక్టుల ప్రగతిని ముఖ్యమంత్రికి అధికారులు నివేదించారు.