ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పవన్‌ గురించి చెప్పుకోవాలంటే ఏముంది?

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Jun 20, 2023, 03:08 PM

వైయస్‌ జగన్‌ ఎవరు అని ప్రశ్నించిన పవన్‌ వ్యాఖ్యలకు బైరెడ్డి సిద్ధార్థరెడ్డి స్ట్రాంగ్‌ కౌంటర్‌ ఇచ్చారు. సీఎం వైయస్‌ జగన్‌ను విమర్శించే స్థాయి పవన్‌కు లేదన్నారు. వైయస్‌ జగన్‌ కంటే రెండేళ్లు పెద్ద వయసు ఉన్న పవన్‌ తన స్థాయి కూడా జగన్‌ మాదిరినే ఉంటుందని పోల్చుకుంటున్నారు. ఇలాంటి మైండ్‌ సెట్‌ మార్చుకుంటే బాగుంటుంది. పవన్‌ ఆయన ఏంటో ఫ్రూవ్‌ చేసుకొని వైయస్‌ జగన్‌నే కాదు..మోదీని, ఇంకా పెద్ద పెద్ద లీడర్లను విమర్శించవచ్చు అన్నారు. వైయస్‌ జగన్‌ అనే వ్యక్తి ఒక ఫ్రూవ్‌డ్‌ లీడర్‌..మళ్లీ కొత్తగా ప్రపంచానికి చెప్పుకోవాల్సిన అవసరం లేదు. నిరూపించుకోవాల్సిన పని లేదు. వైయస్‌ జగన్‌ రెండుసార్లు ఎంపీగా, ఎమ్మెల్యేగా, ప్రతిపక్ష నేతగా, సొంతంగా పార్టీ పెట్టిన అధ్యక్షుడిగా, ముఖ్యమంత్రిగా ఉంటూ రాష్ట్రంలో కొన్ని వేల మందిని నాయకులనుగా, ప్రజాప్రతినిధులుగా తయారు చేశారు. వైయస్‌ జగన్‌ గురించి చెప్పడానికి పెద్ద లిస్టు ఉంది. పవన్‌ ఏం చేశారో చెప్పడానికి ఏమీ లేదన్నారు. వైయస్‌ జగన్‌ సాధించింది చెప్పుకోవడానికి పెద్ద లిస్టు ఉందన్నారు. రాస్తే ఒక పుస్తకం అవుతుంది..చెప్పుకుంటే ఒక చరిత్ర అవుతుంది. పవన్‌ గురించి చెప్పుకోవాలంటే ఏముంది? . 2014లో ఇద్దరితో పొత్తు పెట్టుకున్నాడు. 2019లో నలుగురితో పొత్తు పెట్టుకున్నాడు. 2024లో ఎవరి కోసం పొత్తు పెట్టుకోవాలో ఆలోచిస్తున్నాడు. ప్రభుత్వం తరఫున, వ్యక్తిగతంగా పవన్‌ ప్రజలకు చేసింది ఏముంది? అని ప్రశ్నించారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com