పవన్ కళ్యాణ్ చేసేది రాజకీయమా..? రౌడీయిజమా..? అని రాష్ట్ర జలవనరుల శాఖమంత్రి అంబటి రాంబాబు ప్రశ్నించారు. రాజకీయమంటే సినిమా అనుకున్నావా..? జాగ్రత్తగా మాట్లాడు అంటూ హెచ్చరించారు. ఎవరికో పుట్టిన బిడ్డను ఎత్తుకున్న పనికిమాలిన వ్యక్తి చంద్రబాబు అని ధ్వజమెత్తారు. ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీని లాక్కొని ముద్దాడిన వ్యక్తి చంద్రబాబు అని మండిపడ్డారు. ఎన్టీఆర్ టీడీపీని పెట్టినప్పుడు చంద్రబాబు ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు. ఎవరో చేసిన పనిని తనదిగా చెప్పుకునే దిక్కుమాలిన వ్యక్తి చంద్రబాబు అని నిప్పులు చెరిగారు. చంద్రబాబు బెదిరింపులకు భయపడేవారు తమ పార్టీలో ఎవరూ లేరని స్పష్టం చేశారు.