ఏపీ సీఎం జగన్ సర్కార్‌పై జనసేనాని పవన్ కళ్యాణ్ మరోసారి విరుచుకుపడ్డారు. ‘వంద మంది కష్టాన్ని 30 మందికి పంచుతున్నాడు. వైసీసీ ఉప్మా ప్రభుత్వం. రాష్ట్రంలోని 75 శాతం మంది వైసీపీపై అయిష్టంగా ఉన్నారు. ఆ 75 శాతం మంది ఏకాభిప్రాయానికి వచ్చి, అనైక్యతను జయించాలి. ఉమ్మడి కార్యాచరణను అర్థం చేసుకోవాలి. నా దగ్గర వేల కోట్లు లేవు, సుఫారీ గ్యాంగుల్లేవు, క్రిమినల్స్ లేరు’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.