గుమ్మడిని ఆహారంగా తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి మేలు కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇందులో 92 శాతం నీరు ఉంటుంది. 100 గ్రాముల గుమ్మడిలో 25 క్యాలరీల శక్తి లభిస్తుంది. దీన్ని తీసుకోవడం వల్ల జీర్ణశక్తి మెరుగుపడుతుంది. అయితే చాలా మంది గుమ్మడికాయను తినడం వల్ల వాతం చేస్తుందని భావిస్తుంటారు. చర్మంపై దురదలు వస్తాయని అనుకుంటారు. నిజానికి గుమ్మడికి వాతం చేసే గుణం ఉండదు. గుమ్మడికాయను వండే విధానం వల్ల వాతం చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. చింతపండు, ఉప్పు వేయకుండా చేసే గుమ్మడికాయ వంటకాల వల్ల ఎలాంటి వాతం రాదని నిపుణులు అంటున్నారు.