ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జగన్ ని ప్రశ్నిస్తే , ఇతనికి ఎందుకు..?

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Jun 22, 2023, 11:53 AM

సీఎం జగన్ అవినీతి అక్రమాలను ప్రశ్నిస్తే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజుకు ఎందుకు అని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. టీడీపీ అధినేత చంద్రబాబును ఉద్దేశించి వీర్రాజు ఒంగోలులో చేసిన వ్యాఖ్యలపై బుధవారం ఒక ప్రకటనలో ఆయన స్పందించారు. ‘‘రాష్ట్రాన్ని రావణ కాష్ఠంగా మార్చిన సీఎం జగన్‌పై చర్యలు తీసుకోవాలని మేం కోరితే సోముకు అంత కోపం, అసహనం ఎందుకు వచ్చిందో అర్థం కావడం లేదు. రాష్ట్రాల్లో పాలన గాడి తప్పినప్పుడు, అరాచకం రాజ్యం ఏలుతున్నప్పుడు ఆర్టికల్‌ 355 ప్రకారం కేంద్రం జోక్యం చేసుకొనే అధికారం కేంద్రానికి ఉందని సోము తెలుసుకోవాలి.  ప్రత్యేక హోదా తీసుకువచ్చి ప్రతి జిల్లాను హైదరాబాద్‌ మాదిరిగా అభివృద్ధి చేస్తామని ఎన్నికల ముందు జగన్‌ చెప్పాడు. అది ఎందుకు చేయడం లేదని అడగడం తప్పా? మేం ఆయన్ను ప్రశ్నిస్తే మీకొచ్చిన నష్టమేంటి? ప్రతిపక్ష పార్టీలపై విమర్శలు చేయడం మాని ప్రజా సమస్యలు, ప్రభుత్వ అరాచకాలపై పోరాటం చేస్తే మంచిది’’ అని అచ్చెన్న, సోముకు సూచించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com