నెల్లూరు జిల్లా, కావలిలో దారుణం జరిగింది. రుద్రకోట నుంచి చెన్నాయపాళెంకు గ్రావెల్ తరలిస్తున్న నేపథ్యంలో టిప్పర్ లిఫ్ట్ ఎత్తిన సమయంలో విద్యుత్తు తీగలు తగిలి నరశింహారావుకు షాక్ కొట్టాయి. దీంతో ఆయన పడిపోయాడు. అక్కడున్నవారు కారులో కావలిలోని ఓ ప్రయివేటు ఆసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం ఎమ్మెల్యే రామిరెడ్డి ముఖ్య అనుచరుడు, ఏఎంసీ ఛైర్మన్ ప్రసాద్.. అక్కడ నుంచి చెన్నైకి తరలించేందుకు ప్రయత్నించారు. అప్పటికే నరసింహారావు మృతి చెందడంతో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.