ఉత్తరప్రదేశ్లోని ఎత్వాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అగ్రా-లక్నో ఎక్స్ప్రెస్ వేపై గురువారం ఉదయం ఓ ప్రైవేట్ బస్సు బోల్తా పడింది. వేగంగా వెళ్తున్న బస్సు అదుపు తప్పి బోల్తా కొట్టినట్లు స్థానికులు చెబుతున్నారు. ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.