ఉబర్ కంపెనీ తన ఉద్యోగులకు షాకిచ్చింది. 200 మంది ఉద్యోగులను పదవుల నుంచి తొలగించబోతున్నట్లు ప్రకటించింది. రిక్రూటింగ్ విభాగంలో 35 శాతం అంటే 200 మందిని తొలగించే అవకాశాలు ఉన్నాయి. 32,700 మంది ఉద్యోగులు ఉన్న ఈ సంస్థలో ఈ ఏడాది ప్రారంభంలోనే రవాణా సేవల విభాగం నుంచి 150 మందిని తొలగించింది. అంతర్జాతీయంగా ఉన్న ఆర్థిక మందగమనం కారణంగా ఖర్చులను తగ్గించుకోవడానికి పలు ఐటీ కంపెనీలు ఉద్యోగులను తొలగిస్తున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa