కోర్టు ధిక్కరణ కేసులో విచారణకు గైర్హాజరైన ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్‌ఎస్ రావత్‌పై రాష్ట్ర హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎస్ఎస్ రావత్‌పై హైకోర్టు బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. అనంతరం తదుపరి విచారణను జులై 12వ తేదీకి వాయిదా వేసింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రవినాథ్ తిల్హరీ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. వినుకొండ మున్సిపాలిటీ పరిధిలో సీసీ రోడ్డు ఏర్పాటుకు సంబంధించి ఎర్నెస్ట్ మనీ డిపాజిట్ (ఈఎండీ), ఫ్యూచర్ సెక్యూరిటీ డిపాజిట్ (ఎఫ్‌ఎస్‌డీ) సొమ్మును తిరిగి విడుదల చేయాలని హైకోర్టు ఆదేశించినా. అధికారులు ఆ మేరకు వ్యవహరించ లేదని పేర్కొంటూ కాంట్రాక్టర్ జె. వెంకటేశ్వర్‌రెడ్డి హైకోర్టులో కోర్టు ధిక్కరణ వ్యాజ్యం వేశారు.
దీనిపై ఇటీవల విచారణ జరిపిన హైకోర్టు. విచారణకు హాజరు కావాలని రాష్ట్ర ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్ఎస్ రావత్‌ను ఆదేశించింది. రావత్ రాకపోవడంతో మరో రోజుకు వాయిదా వేయాలని ప్రభుత్వ న్యాయవాది కోరారు. ఇందుకు అంగీకరించిన న్యాయమూర్తి. హాజరు నుంచి మినహాయింపు కోరుతూ అనుబంధ పిటిషన్ వేసుకోవాలని సూచిస్తూ మధ్యాహ్నానికి వాయిదా వేశారు.
మధ్యాహ్నం 2. 45 గంటల సమయంలో మళ్లీ విచారణ చేపట్టగా. ప్రభుత్వ న్యాయవాది హాజరు కాలేదు, హాజరు నుంచి మినహాయింపు కోసం అనుబంధ పిటిషన్ వేయలేదు. దీంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన న్యాయమూర్తి. ముఖ్యకార్యదర్శి ఎస్‌ఎస్ రావత్‌పై బెయిలబుల్ వారెంట్ జారీ చేశారు.