తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో భవిష్యత్తుకు గ్యారెంటీపై చిలకలూరిపేట నియోజకవర్గంలో గణపవరం 3వ వార్డులో విస్తృత ప్రచారం నిర్వహించారు. మాజీమంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఆదేశాల మేరకు 3వ వార్డులో ఇంటింటికీ వెళ్లి తెదేపా నాయకులు ప్రజల సమస్యలు, కష్టాలను అడిగి తెలుసుకున్నారు. చంద్రబాబు ప్రకటించిన తొలి మేనిఫెస్టోలోని అంశాలపై బుధవారం సాయంత్రం తెదేపా నాయకులు ప్రజలకు అవగాహన కల్పించారు. భవిష్యత్తుకు గ్యారెంటీ కరపత్రాలను 3వ వార్డులో ఇంటింటికీ వెళ్లి పంపిణీ చేశారు. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చాక ఒక్కో కుటుంబానికి ఏడాదికి రూ. 1. 22 లక్షలు. ఐదేళ్లలో రూ. 6 లక్షల వరకు లబ్ధి చేకూరుతుందని ప్రజలకు తెలియజేశారు. సైకో పోవాలి. సైకిల్ రావాలంటూ వార్డులో ర్యాలీ నిర్వహించారు.