ఈ నెల 18న పాడేరు పోలిస్ స్టేషన్ లో జి. మాడుగుల మండలం కొరాపల్లి గ్రమానికి చెందిన కొరాబు త్రిమూర్తి తన కూతురు మృతి పై ఇచ్చిన ఫిర్యాదుతో దర్యాప్తు ప్రారంభించిన పోలీసులకు విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. జి. మాడుగుల మండలం కోరాపల్లి గ్రామానికి చెందిన కోరాబు బొడ కొండమ్మ (20) ని పాడేరు మండలం తియ్యగెడ్డకు చెందిన పాంగి గణపతి అనే వ్యక్తి మూడో పెళ్లి చేసుకొని కొద్దిరోజులుగా ఒంగోలులో కాపురం ప్రారంభించాడు. అయితే భార్య బొడకొండమ్మ తల్లిదండ్రుల వద్దకు తీసుకువెళ్ళమని పదే పదే అడిగే సరికి నిందితుడి సొంత ఊరు తియ్యగెడ్డ ఈ నెల 14 తారీఖున తీసుకు వచ్చాడు. మృతురాలు సొంత ఊరు తల్లిదండ్రుల వద్దకు వెళ్తానని గొడవ పడటంతో ఉంటే నాతోనే ఉండాలి లేకుంటే చంపేస్తానని బెదిరించాడు.
మృతురాలు అతని మాట వినకుండా ఈ నెల 16వ తేదీన ఉదయం ఇంటికి వెళ్ళే ప్రయత్నం చేసే సరికి కోపంతో చున్నినీ మెడకు చుట్టి హతమార్చి తన కుటుంబ సభ్యులు సోబన్, మహేష్, లక్ష్మమ్మ, భారతి, వెంకట్ లకు విషయాన్ని తెలిపాడు. వారి సహాయంతో గ్రామస్తులకు అనుమానం రాకుండా గ్రామానికి కిలోమీటరు దూరంలో మృతదేహాన్ని పాతిపెట్టాడు. జంతువులు మృతదేహాన్ని బయటకు లాగకుండ పైన కర్రలు పేర్చి మంట వేశారు. నీ కూతురు అనారోగ్యంతో మృతి చెందిందని సమాచారం ఇవ్వడంతో తండ్రి త్రిమూర్తి అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దర్యాప్తులో భాగంగా సీఐ సుధాకర్, ఎస్సై లక్ష్మణ్ లు తండ్రి త్రిమూర్తుని వెంట బెట్టుకొని దహన సంస్కారాలు చేసిన ప్రాంతం పరిశీలించి నిజాలను వెలుగులోకి తెచ్చి నిందితులను అరెస్ట్ చేశారు.