బాలికపై అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న విశాఖ రామానంద, జ్ఞానానంద ఆశ్రమ నిర్వాహకుడు పూర్ణానంద సరస్వతీ స్వామికి జులై 5వ తేదీ వరకు ప్రధాన మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ న్యాయస్థానం రిమాండ్ విధించింది. బాధిత బాలిక ఫిర్యాదుపై విజయవాడ పోలీసులు స్వామిపై కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. అనంతరం విశాఖ దిశ స్టేషన్కు కేసును బదిలీ చేశారు. దీంతో బుధవారం పోలీసులు పూర్ణానంద సరస్వతీ స్వామిని న్యాయస్థానంలో హాజరుపరచగా రిమాండ్ విధించారు.