అత్తపై దాడి చేసిన అల్లుడిపై కేసు నమోదు చేసినట్లు కంచరపాలెం పోలీ సులు పేర్కొన్నారు. వివరాలిలావున్నాయి. ధర్మానగర్ ప్రాంతానికి చెందిన ముంత సుధ చిన్న కుమార్తె ఆశాదీప్తి, ఆమె భర్త గణేశ్వరరావుకు గతంలో గొడవలు జరిగి అప్పటి నుంచి కుమార్తె పుట్టింటిలోనే ఉంటోంది. ఈ మేరకు కోర్టులో వ్యాజ్యం నడుస్తోంది. ఇదిలా ఉండగా బుధవారం ఉదయం అల్లుడు ఇల్లు ఖాళీ చేసి సామాన్లు వ్యానులో తీసుకువెళ్తుండడాన్ని అత్త సుధ చూసింది. న్యాయస్థా నంలో కేసు ఉండగా ఇల్లు ఎలా ఖాళీ చేస్తావంటూ అల్లు డిని నిలదీసింది. దీనికి ఆగ్రహించిన అతడు ఆమె ముఖాన్ని వాహనానికి గుద్దడంతో తలకు గాయాలయ్యాయి. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు దర్యాపు చేస్తున్నట్లు సీఐ విజయకుమార్ తెలిపారు.