ఎన్ఏడీ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ దిగువన 4 సంవత్సరాల బాలికపై వృద్ధుడు అత్యాచార యత్నం చేసిన ఘటనపై దిశా పోలీస్ స్టేషన్ డీఎస్పీ వివేకానంద్ విచారణ చేపట్టారు. ఈ మేరకు మంగళవారం జరిగిన నాలుగేళ్ల బాలికపై 60ఏళ్ల వృద్ధుడు అత్యాచార యత్నం చేసిన వ్యక్తిని ఏర్పోర్ట్ పోలీస్ స్టేషన్ సిబ్బంది అదుపులోకి తీసుకుని విచారించారు. ఈ కేసును ఎయిర్పోర్టు పోలీసులు దిశా పోలీస్ స్టేషన్ కు బదలాయించారు. దీంతో దిశా పోలీసులు గురువారం విచారణ చేపట్టారు. పిర్యాది రోజామణి సమక్షంలో ఘటనా స్థలంలో జరిగిన విషయంపై ఆరా తీశారు. చుట్టుపక్కల వారిని వివరాలు అడిగి తెలుసుకున్నారు ఘటన ఏవిధంగా జరిగిందో పోలీసులకు స్థానికులు విచారించారు. కేసు నమోదు చేశామని దర్యాప్తు చేపడుతున్నామని డీఎస్పి వివేకానంద్ తెలిపారు.