అనకాపల్లి జిల్లా రాజన కన్నబాబు అనే రౌడీషీటర్ హత్యకు గురైయ్యాడు. అనకాపల్లి మండలం ఊడేరు రహదారి సమీపంలో హత్యకు గురైనట్టు పోలీసులు గుర్తించారు. ఈ రౌడీషీటర్ రెండేళ్ల క్రితం నగర పోలీసులు బహష్కరించారు. దీంతో రౌడీషీటర్ అనకాపల్లి గాంధీ నగరంలో తల్లితోపాటు నివాసం ఉంటున్నాడు. కన్నబాబు విశాఖ ఉమ్మడి జిల్లాల్లో భూ దందాలు సెటిల్మెంట్లు చేస్తుండేవాడు. కిడ్నాప్ హత్య కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. ఈ క్రమంలో కన్నబాబు హత్యకు గురయ్యాడు. పూర్తి వివరాలు ఇంకా అందాల్సి ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa