విశాఖ వేంకోజీపాలెంలో జ్ఞానానంద ఆశ్రమం వద్ద మైనర్ ఇద్దరు బాలికలపై అత్యచారం చేసిన పూర్ణనంద స్వామిజీ పై గతంలో కాకుండా ప్రస్తుత ఘటనపై సమగ్ర విచారణ చేపట్టి కొన్ని రోజుల వ్యవధిలో చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని మహిళ సమాఖ్య, యువజన, విద్యార్ధి నాయకులు ఆశ్రమం వద్ద ఆందోళన చేస్తుంటే జిల్లా మహిళ నాయకు రాలు వనజాక్షిపై మహిళ ఎస్ ఐ దివ్య జ్యోతి దురుసుగా ప్రవర్తించి కొట్టడం హేయమైన చర్యగా అభివర్ణించారు. మహిళ ఎస్. ఐ ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ మహిళ లతో ఆందోళన కార్యక్రమంగురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహిళ సమాఖ్య పెందుర్తి ఏరియా కార్యదర్శి అంపావల్లి అన్నపూర్ణ, అధ్యక్షులు ఎన్. నారాయణ, కక్కల రజినీ, అనురాధ, రామ లక్ష్మి, మహిళలు పాల్గొన్నారు.