అనకాపల్లి అచ్చుతాపురం రోడ్డు మరమ్మత్తులు కాకుండా పూర్తిస్థాయిలో రోడ్డు నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేస్తూ గురువారం సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో అచ్చుతాపురం నాలుగు రోడ్డు జంక్షన్లో రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు జి. కోటేశ్వరరావు మాట్లాడుతూ అచ్చుతాపురం అనకాపల్లి రోడ్ లో భారీ అతి భారీ వాహనాలు ప్రతిరోజు వందల సంఖ్యలో తిరుగుతున్నాయి. రోడ్డు గోతులతో ఉండటంవల్ల ప్రాణాలు కోల్పోతున్నారు. ఒక్క బ్రాండిక్స్ బస్సులో వందల సంఖ్యలో తిరుగుతున్నాయి. అనేకసార్లు ఇటీవల ప్రమాదాలు జరిగాయి.
బైకుల మీద వెళ్లే వారైతే అరచేతుల ప్రాణాలు పెట్టుకుని వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడుతుంది. క్షేమంగా ఇంటికి వెళతాం అనేటువంటి నమ్మకం ఉండడం లేదు. గతంలో అనేకసార్లు వైయస్సార్ ఎమ్మెల్యేలు మంత్రులు రోడ్డు విస్తరణ పనులు చేపట్టి పూర్తిస్థాయిలో రోడ్లు వేస్తామని చెప్పి హామీ ఇచ్చారు. సంవత్సరాలు గడుస్తుఅమలు కావట్లేదు అని విమర్శించారు. భూములు కోల్పోతున్న నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లించి రోడ్డు విస్తరణ పనులు చేపట్టాలి. కేవలం మరమ్మతు చేసి చేతులు దులుపుకుంటే వచ్చే వర్షాకాలంలో గోతులు పెరిగిపోయి మరిన్ని ప్రమాదాలు జరుగుతాయి. ఏ ఒక్క నష్టం జరిగిన దాని పూర్తి బాధ్యత వైయస్సార్ ప్రభుత్వ వహించాలి. ఇప్పటికైనా ప్రభుత్వం అధికారులు స్పందించి రోడ్డు నిర్మాణం చేపట్టాలి. లేనిపక్షంలో పెద్ద ఎత్తున ప్రజానీకాన్ని కలుపుకొని ఆందోళన చేస్తావనిహెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రొంగలి రాము, కుండ్రపు సోమనాయుడు, అప్పారావు, దుర్గ, తదితరులు పాల్గొన్నారు.