స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. FLC కౌన్సిలర్, FLC డైరెక్టర్ పోస్టులకు సంబంధించి మొత్తం 194 ఖాళీలను భర్తీ చేస్తోంది. దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభం కాగా.. జూలై 6ను చివరితేదీగా నిర్ణయించారు. ఇందులో ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.35,000- రూ.60,000 చెల్లించబడుతుంది. పూర్తి వివరాలకు sbi.co.in ను సంప్రదించండి.