రాష్ట్రంలోని నిరుద్యోగులను సీఎం జగన్ మోసం చేశారని జనసేన అధినేత పవన్ కల్యాణ్ విమర్శించారు. 2.30 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన జగన్ ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో చెప్పాలన్నారు. వారాహి విజయ యాత్ర అనంతరం అమలాపురంలో భారీ బహిరంగ సభ జరిగింది. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ.. గత ఎన్నికల్లో ఓటు వేసేటప్పుడు యువత ఒక్కసారి ఆలోచించి ఉంటే బాగుండేదన్నారు. వైసీపీకి ఓటు వేసి గెలిపించారని, ఉద్యోగాలు మాత్రం రాలేదన్నారు. తనను గెలిపించి అసెంబ్లీకి పంపి ఉంటే కనీసం లక్ష ఉద్యోగాలు వచ్చేవని పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు.