ఇటీవల ఒడిశాలో వందలాది మంది మరణించిన సంగతి తెలిసిందే. తాజాగా మరో రైలు ప్రమాదం జరిగింది. చెన్నై నుంచి ముంబై వెళ్తున్న లోకమాన్య తిలక్ ఎక్స్ప్రెస్లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. చెన్నై బేసిన్ బ్రిడ్జి సమీపంలో రైలు ఇంజన్ నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో ప్రయాణికులు భయాందోళనకు గురై బోగీల నుంచి పరుగులు తీశారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు.