తిరుమల నడకమార్గంలో నాలుగేళ్ల బాలుడిపై చిరుత దాడి చేసిన ఘటనపై టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి స్పందించారు. చిరుత దాడిలో గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలుడిని శుక్రవారం ఉదయం టీటీడీ చైర్మన్ పరామర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చిరుత దాడిలో గాయపడిన బాలుడు క్షేమంగా ఉన్నాడన్నారు. చిన్నపిల్లల ఆసుపత్రిలో వైద్యులు చికిత్స అందిస్తున్నారని తెలిపారు. బాలుడి ఆరోగ్యంపై వైద్యులను అడిగి తెలుసుకున్నట్లు చెప్పారు.