వైసీపీ అరాచక పాలన నుంచి రాష్ట్రాన్ని రక్షించాలని, తిరిగి చంద్రబాబుని సీఎంని చేయడమే లక్ష్యంగా కృషి చేయాలని కోరుతూ తెలుగుదేశం పార్టీ అన్ని నియోజకవర్గాల్లో బస్సు యాత్రలను చేస్తోంది. ‘భవిష్యత్తుకు గ్యారెంటీ’ పేరుతో చేస్తున్న ఈ యాత్రల్లో ఆయా నియోజకవర్గ స్థాయి నేతలతో పాటు, రాష్ట్ర స్థాయి నేతలు కూడా పాల్గొంటున్నారు. ప్రకాశం జిల్లాలో ప్రజా చైతన్య బస్సు యాత్రలో భాగంగా రెండో రోజైన గురువారం టీడీపీ నాయకులు ప్రకాశం జిల్లా కొత్తపట్నం మండలం పల్లెపాలెం నుంచి టంగుటూరు మండలంలోని సూరారెడ్డిపాలెం చేరుకున్నారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి మాట్లాడారు. ‘‘రాష్ట్రంలో అన్ని వర్గాలపై దాడులు నిత్యకృత్యమయ్యాయి. రాష్ట్రాన్ని, ఉన్న వనరులను సీఎం జగన్ దోచుకుని దాచుకుంటున్నాడు.’’ అని ఆగ్రహించారు.