ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అసత్య ప్రచారాలు చెయ్యడమే కాదు, నిరూపించగలవా...?

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Jun 23, 2023, 01:32 PM

ఎమ్మెల్యే ప్రతాప్‌కుమార్‌రెడ్డి ఇంటి ఆవరణలో 153 అంకణాల నిషేధిత స్థలం, 20 అంకణాల ఇరిగేషన్‌ కాలువ భూమి ఉందని నిరూపించేందుకు తాను సిద్ధమేనని బీజేపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు జీ భరత్‌కుమార్‌ తెలిపారు. కావలి స్థానిక నమస్కార్‌ కాన్ఫరెన్స్‌ హాలులో గురువారం సాయంత్రం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఎమ్మెల్యే తన ఇల్లు ప్రభుత్వ భూమిలో ఉందని నిరూపిస్తే దాన్ని పడగొడతానని, లేకపోతే ఆరోపణలు చేసిన బీజేపీ నేత వీర్రాజు రాజీనామా చేయాలని విసిరిన సవాల్‌ను తాను స్వాగతిస్తున్నాన్నారు. ఆయన ఇంటి ఆవరణలో ప్రభుత్వ భూమి ఉందని నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలన్నారు. ఎమ్మెల్యే బెదిరింపులు, దౌర్జన్యాలకు బీజేపీ భయపడదన్నారు. ఈ సమావేశంలో బీజేపీ నేతలు పరుసు వెంకటేశ్వర్లు, మామిడి వెంకటేశ్వర్లు, తిరుపతి స్వామి, కృష్ణ, వెంకటరెడ్డి, మస్తాన్‌ తదితరులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com