యువగళం పాదయాత్రలో భాగంగా 134వ రోజు గురువారం ఆయన తిరుపతి జిల్లా వెంకటగిరి మండలంలో పర్యటించారు. వెంకటగిరి పట్టణంలో జరిగిన బహిరంగసభలో ప్రసంగించారు. తన ప్లస్‌లు, సీఎం జగన్ మైన్‌సలను ప్రస్తావించారు. ‘మీ లోకేశ్‌ది అంబేడ్కర్ రాజ్యాంగం... జగన్‌ది రాజారెడ్డి రాజ్యాంగం.. మీ లోకేశ్ లోకల్.. జగన్‌ది ప్యాలెస్.. మీ లోకేశ్‌ది యువగళం.. జగన్‌ది పరదాల బతుకు.. మీ లోకేశ్ అందరివాడు.. జగన్ అమ్మను, చెల్లిని గెంటేసినవాడు.. చంద్రన్న విజనరీ... జగన్ అప్పుల అప్పారావు.. టీడీపీ అంటే తెలుగువారి ఆత్మగౌరవం.. వైసీపీ అంటే గలీజు పార్టీ’ అని వివరిస్తూ జనాన్ని ఆకట్టుకున్నారు. జగన్‌కు మైథోమానియా సిండ్రోమ్ అనే జబ్బు ఉందని.. ఉన్నది లేనట్లు.. లేనిది ఉన్నట్లు చెప్పడం దాని లక్షణమన్నారు.