తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం ధుమంతునిగూడెం, సుబ్బరాయపురం, కృష్ణపాలెం గ్రామాలకు చెందిన పలువురికి ధుమంతునిగూడెంలో సుమారు రెండెకరాల భూమి కొనుగోలు చేసి, స్థలాన్ని చదును చేయకుండా ఇళ్ల స్థలాలుగా ఇచ్చారు. ఆ స్థలం నిర్మాణానికి అనుకూలంగా లేకపోవడంతో ఇళ్ల నిర్మాణాలకు లబ్ధిదారులు ముందుకు రాలేదు. ఇళ్లు కట్టుకోవాలని ఇటీవల అధికారుల నుంచి ఒత్తిడి వస్తుండటంతో ఆ స్థలాలు మాకొద్దంటూ లబ్ధిదారులంతా ఇళ్ల పట్టాలు పట్టుకుని ఆందోళనకు దిగారు. ‘జగనన్నా.. మీరిచ్చిన స్థలాలు మాకొద్దన్నా’ అంటూ నినాదాలు చేశారు. సమస్య పరిష్కారానికి రిలే నిరాహారదీక్షలు చేపడతామని తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa