ఏపీలో కాంట్రాక్టు లెక్చరర్లు తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ రోడ్డెక్కారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తమ గోడు వినాలంటూ విజ్జప్తి చేశారు. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణలో 2014, జూన్ 2 కట్ ఆఫ్ నిభందనను సడలించాలని కోరారు. శుక్రవారం ఉదయం ప్రభుత్వ సలహాదారు సజ్జ రామకృష్ణారెడ్డి కార్యాలయం ముందు భారీగా కాంట్రాక్ట జూనియర్ లెక్చరర్స్ నిరసనకు దిగారు. తెలంగాణలో కటాఫ్ డేట్ పెట్టకపోవడంతో తమతో ఒకే సమయంలో ఉద్యోగాలు పోందిన వారు రెగ్యూలరైజ్ అయ్యారని తెలిపారు. ఇదే నిభందనను ఏపీలో అవలంభించాలని డిమాండ్ చేశారు. దీనివల్ల ప్రభుత్వంపై ఎలాంటి భారం పడకపోగా 2100 మంది కాంట్రక్టు లెక్చరర్స్‌కు ఉద్యోగ భద్రత కలుగుతుందంటూ విజ్ఞప్తి చేశారు. గతంలో ర్యాలీ నిర్వహించినప్పటికీ ప్రభుత్వం పట్టించుకోలేదు. దీంతో సజ్జల ఆఫీస్‌కు వందలాది కాంట్రాక్ట్ జూనియర్ లెక్చరర్స్ చేరుకున్నారు.