పెళ్లి కావడం లేదనే మనస్థాపంతో రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన కర్ణాటకలోని హవేరి జిల్లాలో జరిగింది. రైతు మంజునాథ్ నాగునూర్(36) విషం తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. గత 8 ఏళ్లుగా పెళ్లి చేసుకోవడానికి అమ్మాయి దొరకడం లేదని సూసైడ్ నోట్ లో తెలిపాడు. తనకు పెళ్లి కాకపోవడంతో తల్లిదండ్రులు సైతం తీవ్ర నిరాశలో మునిగిపోయారని, అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నానని పేర్కొన్నాడు.