అయోధ్య రామమందిరం కోసం గుజరాత్‌లోని వడోదరా నగర తర్సాలీ ప్రాంతానికి చెందిన కొందరు బాహుబలి అగరబత్తిని తయారు చేశారు. 108 అడుగుల పొడవు, 3, 403 కిలోల బరువు, 3. 5 అడుగుల చుట్టుకొలత ఉన్న దీని తయారీకి రెండు నెలల సమయం పట్టిందని, 191 కిలోల ఆవునెయ్యి, 376 కిలోల గుగ్గిలం పొడి, 280 కిలోల బార్లీ, 280 కిలోల నువ్వులు, 376 కిలోల కొబ్బరిపొడి, 425 కిలోల పూర్ణాహుతి సామగ్రి, 1, 475 కిలోల ఆవుపేడను వాడామని తెలిపారు.