కేంద్ర ప్రభుత్వ పరిధిలో పనిచేస్తున్న శాఖలు, సంస్థల ఉద్యోగులకు బయోమెట్రిక్ అటెండెన్స్ తప్పనిసరి చేసింది కేంద్రం. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఇక నుంచి ఆధార్ ఆధారిత బయోమెట్రిక్ విధానం ద్వారా ఉద్యోగులు తమ హాజరు నమోదు చేయాలని సూచించింది. డ్యూటీకి రాకున్నా వచ్చినట్లు నమోదు చేసుకోవడం, ఆఫీస్ కి ఆలస్యంగా రావడం లాంటివి పరిగణలో ఉంచుకొని బయోమెట్రిక్ తప్పనిసరి చేస్తూ ఆదేశాలు జారీ చేసింది.