అలిపిరి మెట్ల దారిలో చిన్నారిపై దాడి చేసిన చిరుతను అటవీశాఖ అధికారులు బంధించారు. దాడి అనంతరం అలిపిరి మార్గంలో 150 ప్రాంతాల్లో అధికారులు సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. చిరుత సంచారాన్ని గమనించిన అధికారులు శుక్రవారం సాయంత్రం వేర్వేరు ప్రాంతాల్లో రెండు బోన్లను ఏర్పాటు చేశారు. శుక్రవారం రాత్రి 10: 45 గంటల ప్రాంతంలో చిరుత బోనులో చిక్కినట్లు అధికారులు తెలిపారు. బోనులో చిక్కిన చిరుతను టీటీడీ ఈఓ పరిశీలించారు.