ప్రియుడిపై మోజుతో ఓ భార్య తన భర్తను అంతమొందించిన ఘటన కర్ణాటకలోని బెళగావి పట్టణంలో చోటు చేసుకుంది. వివరాల ప్రకారం.. అంబేడ్కర్ నగర్లో రమేశ్ కాంబళే, సంధ్యా నివాసముంటున్నారు. సంధ్య.. బాళు బీరెంజె అనే వ్యక్తిలో అక్రమ సంబంధం పెట్టుకుంది. తన ఆనందానికి భర్త అడ్డుగా ఉన్నాడని భావించి సంధ్యా.. మరో ముగ్గురితో కలిసి అంతమొందించింది. ఆ తర్వాత తన భర్త వేరే మహిళతో పారిపోయాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమెపై అనుమానంతో విచారణ జరిపిన పోలీసులు సంధ్యతోపాటు ముగ్గురిని అరెస్ట్ చేశారు.