ఏపీలోని రైతులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఖరీఫ్ కోసం 10 లక్షల టన్నుల ఎరువులను రైతు భరోసా కేంద్రాల్లో అందుబాటులో ఉంచామని తెలిపింది. 5 లక్షల క్వింటాళ్ల విత్తనాలు అవసరం కాగా, 4 లక్షల క్వింటాళ్లు సిద్ధం చేశామని వ్యవసాయ శాఖ కమిషనర్ హరికిరణ్ తెలిపారు. కోస్తాంధ్రకు వరి, రాయలసీమకు వేరుశనగ విత్తనాలు, వర్షాలు సరిగ్గా కురవకపోతే ఉలవలు, చిరుధాన్యాలు, సాగుకు విత్తనాలు సిద్ధం చేస్తున్నామని తెలిపారు.