రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఏడాదిగా కొనసాగుతూనే ఉన్నా రష్యాకు మాత్రం ఆటంకాలు తప్పడం లేదు. యుద్ధ భూమిలో ఆశించిన ఫలితం దక్కని పుతిన్ ప్రభుత్వానికి పిడుగులాంటి వార్త ఆందోళనలోకి నెట్టేసింది. ఇప్పటివరకు రష్యా బలగాలకు అండగా ఉన్న వాగ్నర్ గ్రూప్.. ఇప్పుడు తిరుగుబావుటా ఎగరేసింది. మాస్కోలోని సైనిక నాయకత్వాన్ని కూలదోసేందుకు అన్ని చర్యలు తీసుకోనుంది. తమకు అడ్డు వచ్చే వారిని ఉపేక్షించమని స్పష్టం చేసింది.