ఏపీ ప్రభుత్వం 'జగనన్న అమ్మ ఒడి' పథకంలో భాగంగా విద్యార్థుల తల్లుల ఖాతాల్లోకి రూ. 13 వేలను జమ చేయనుంది. ఈనెల 28న సీఎం జగన్ పార్వతీపురం జిల్లా కురుపాంలో పర్యటించి అమ్మ ఒడి నిధులను విడుదల చేయనున్నారు. కాగా, జిల్లా ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి తొలిసారిగా వస్తుండడంతో అధికారులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. సభకు భారీగా జనసమీకరణ చేస్తున్నారు.