పట్నాలో విపక్షాల సమావేశం అనంతరం మీడియా తో మాట్లాడుతూ నవ్వులు పూయించారు ఆర్జేడీ అధ్యక్షుడు లాలూప్రసాద్. రాహుల్ గాంధీ పెళ్లి ప్రస్తావన పై స్పందిస్తూ.. మా మాట విను. పెళ్లి చేసుకోవయ్యా. మేమంతా నీ బరాత్‌కు రావాలనుకుంటున్నాం. వివాహానికి నీవింకా విముఖత చూపుతుండటంతో మీ అమ్మ ఆందోళన చెందుతోందని అన్నారు. దీంతో సిగ్గుపడ్డ రాహుల్ చిరునవ్వులు చిందిస్తూ.. మీరు చెప్పారు కాబట్టి అది జరుగుతుందనిబదులిచ్చారు.