ట్రెండింగ్
Epaper    English    தமிழ்

హిమాచల్‌ప్రదేశ్‌లో ఆ ప్రాంతవాసులకు హెచ్చరిక

national |  Suryaa Desk  | Published : Sat, Jun 24, 2023, 02:38 PM

హిమాచల్‌ప్రదేశ్‌లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. శుక్రవారం రాత్రి నుంచి శనివారం ఉదయం నాటికి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. సిమ్లాలో 81 మిల్లీమీటర్ల వర్షాపాతం నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. భారీ వర్షాల కారణంగా నదుల్లో వరదలు పోటెత్తాయి. మండి జిల్లాలోని ధర్మాపురం దగ్గరున్న నది ఉగ్రరూపం దాల్చింది. ఈ మేరకు అప్రమత్తమైన ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. నది ప్రభావిత ముంపు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, సురక్షిత ప్రాంతాలు తరలి వెళ్లాలని సూచించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com