ఏపీలోని 2 వేల సచివాలయాలను సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలుగా గుర్తించిన ప్రభుత్వం, తాజాగా మరో 195 కార్యాలయాలకు ఈ హోదా కల్పించింది. అనకాపల్లి, చిత్తూరు, కృష్ణ, పార్వతీపురం, నెల్లూరు, శ్రీకాకుళం, తిరుపతి, విజయనగరం, వైఎస్సార్, ప్రకాశం, కోనసీమ, ఏలూరు. కర్నూలు జిల్లాల్లోని కార్యాలయాలకు ఈ హోదా కల్పించింది. కార్యదర్శులను సబ్ రిజిస్ట్రార్లుగా, డిజిటల్ అసిస్టెంట్లను వారికి సహాయకారిగా నియమించింది.