రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అండతో పుట్టుకొచ్చిన కిరాయి సైన్యం వాగ్నర్ గ్రూప్ ఆయన పైనే తిరుగుబాటు చర్యలకు పూనుకుంది. ఇప్పటికే రొస్తోవ్లోని మిలిటరీ కార్యాలయాన్ని వాగ్నర్ సేన ఆధీనంలోకి తీసుకుంది. ఇప్పుడు దేశ రాజధాని మాస్కో వైపు అడుగులు వేస్తుంది. దీంతో అప్రమత్తమైన మాస్కో మేయర్ సెర్గెయ్ సోబ్యానిన్.. వీలైనంత వరకు పౌరులెవరూ ఇళ్ల నుంచి బయటకి రావొద్దని, అందరూ జాగ్రత్తగా ఉండాలని సూచనలు చేశారు.