మహిళను కొడవలితో నరికిన వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు మదనపల్లి డిఎస్పి కేసప్ప తెలిపారు. మదనపల్లె మండలంలోని వేంపల్లికి చెందిన రాణి (30)పై ఆమె చిన్న మామ శంకర్ భూ తగాదాలతో ఆదివారం కత్తితో నరికి హత్యాయత్నంకు పాల్పడ్డ విషయం తెలిసిందే. జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాదితురాలు రాణిని డీఎస్పీ విచారించారు. శంకర్ తన భూమి ఖాజేయడానికి నరికాడని ఆమె చెప్పడంతో అతనిపై హత్యాయత్నం కేసు నమోదు చేసినట్లు డిఎస్పీ తెలిపారు.