ఒడిశాలోని గంజాం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆదివారం అర్థరాత్రి సమయంలో రెండు బస్సులు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 10 మంది స్పాట్ లోనే మృతిచెందగా, మరో 8 మందికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను బర్మాపూర్ లోని MKCG మెడికల్ కాలేజీకి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాదంపై సీఎం నవీన్ పట్నాయక్ దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ మృతులకు రూ. 3 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా ప్రకటించారు.