పొద్దున్నే బెల్లం, శెనగలు తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఈ రెండు పదార్థాలను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల అనేక వ్యాధులను నివారించవచ్చని అన్నారు. బెల్లం, శెనగలో ఉండే కాల్షియం వల్ల ఎముకలు స్ట్రాంగ్‌గా తయారవుతాయి. గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. ఇందులో ఉండే పోషకాలు గుండె సంబంధిత ప్రమాదాలను తగ్గిస్తాయి. అలాగే శరీర బరువు అదుపులోకి వస్తుంది. జీర్ణశక్తి కూడా మెరుగుపడుతుంది. రక్తహీనత లోపాన్ని తొలగిస్తుందని నిపుణులు చెబుతున్నారు.