నందిరాజుతోట వంతెన వద్ద వాన పడితేచాలు వాహనదారులకు ఇక్కట్లేనని వాహనచోదకులు అంటున్నారు. వంతెన నిర్మాణం మొదలుపెట్టిన దగ్గర నుండి అర కిలోమీటర్ వరకు రోడ్ సరిగా లేకపోవడంతో పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని నియోజకవర్గ వాహనదారులు వాపోతున్నారు. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు మెడికల్ చెకప్ కోసం బాపట్లలోని హాస్పిటల్ లకు వెళ్లాంటే మరి ఇబ్బందిగా ఉంటుందని వాపోతున్నారు. సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.