రేపల్లె రూరల్ మండలం కట్టవ గ్రామానికి చెందిన లంకె శంకర్ ఇంటిపై ఇటీవల పిడుగు పడి ఇల్లు పూర్తిగా దగ్డమైంది. సోమవారం రేపల్లెలోని ఎంపీ మోపిదేవి వెంకటరమణ వ్యక్తిగత కార్యాలయంలో శంకర్ కు ఇంటి మరమ్మత్తుల నిమిత్తం 5 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని ఎంపీ మోపిదేవి అందజేశారు. ప్రభుత్వం నుంచి నూతనంగా గృహ నిర్మాణం జరిగేలా కృషి చేస్తానని చెప్పారు. కట్టవ గ్రామస్తులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.