ప.గో జిల్లా నరసాపురంలో జనసేన తరఫున జిల్లాలో గత ఎన్నికల్లో పోటీచేసిన నేతలతో పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ.. 'మార్పు కోసం వచ్చిన మనం.. ఎలాంటి పరిస్థితుల్లోనూ పోరాటం విడిచిపెట్టకూడదన్నారు. ఏపనయిన మొదలుపెట్టాక వదిలిపెట్టకూడదు. కొద్దిమంది చేతుల్లోనే విద్య, వైద్యం అందుబాటులో ఉంటే ఎలా? అంటూ ప్రశ్నించారు. ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించి మాస్టర్ ప్లాన్ తయారు చేస్తున్నామన్నారు.